Custom Search

అర్ధం కాని విషయం

డాక్టర్ అయోమయం దగ్గరికి తరచుగా యాభై ఏళ్ళవయసున్న ఒక ఆవిడ వచ్చేది.
ఆమె అస్తమా రోగి.
ఆమె ఎప్పుడు వచ్చినా డాక్టర్ కి ఒక విషయం మాత్రం అర్ధం అయ్యేదికాదు. అది ఏంటంటే ఆమె తన అస్తమా రోగం గురించి మాట్లడుతుందో లేక తన భర్త గురించి మాట్లడుతుందో తెలియక తికమక పడేవాడు.
ఆమె ఇలా చెప్పేది.
డాక్టర్ గారు ఇంకా ఈ బాధ భరించడం నా వల్ల కాదు,
ఈ హింస నేను భరించలేను,
25 ఏళ్ళ నుంచి ఎలాగో భరిస్తున్నాను,
ఇంకా నాకు ఓపిక లేదు,
ఒక్కోసారి విసుగొచ్చి మార్చేయలనిపిస్తుంది

కామెంట్‌లు లేవు: