Custom Search

చురుక్కులు - చమక్కులు

Two things are infinite: the universe and human stupidity; and I'm not sure about the universe

quotes by, Albert Einstein

చురుక్కులు - చమక్కులు

మగవారికి గొప్ప గొప్ప ఆలోచనలు రావడానికి కారణం మహిళలే, వాటిలో కొన్నింటిని సాధించలేక పోవడానికి కారణమూ వాళ్ళే.

-డ్యుమాస్

తప్పు

భర్త : తెలిసి చెసినా , తెలియక చేసినా తప్పు తప్పే . ఒప్పుకుంటావా.
భార్య : ఎందుకోప్పుకోనండి, ఈ విషయం మిమ్మల్ని చేసుకున్నాకే కదా నాకు తెలిసింది.
భర్త : అ ??????????.....

ఏంటి?

భర్త : మగవాళ్ళ రోజుకు వెయ్యి మాటలు మాట్లాడితే ఆడవాళ్లు రెండు వేల మాటలు మాట్లాడుతారు, తెలిసిందా ........

భార్య : అవునండీ, ఎందుకంటే మగవాళ్ళకు ఏవిషయమైనా ఒక్కసారి చెబితే అర్థం కాదు, అర్థమైందా.........

భర్త : ఏంటి?

రిస్క్

రావు : చారిగారు మీకోవిషయం తెలుసా

చారి : మీరు చేబితెకదా తెలిసేది

రావు : ఇన్నేళ్ళ నుంచి నాకు మా ఆవిడకు ఒక్కసారి కూడా గొడవ జరగలేదు తెలుసా

చారి : ఊరుకోండి అంతా అబద్దం

రావు : అబద్దం కాదండి నేను మా ఆవిడ మాట కాదంటే కదా గొడవ

చారి : ఏంటండి ...... మీరు మా అందరిలో తెలివైనవారు కదా?

రావు : అందుకేనండీ రిస్క్ తీసుకోలేదు ...................

అర్ధం కాని విషయం

డాక్టర్ అయోమయం దగ్గరికి తరచుగా యాభై ఏళ్ళవయసున్న ఒక ఆవిడ వచ్చేది.
ఆమె అస్తమా రోగి.
ఆమె ఎప్పుడు వచ్చినా డాక్టర్ కి ఒక విషయం మాత్రం అర్ధం అయ్యేదికాదు. అది ఏంటంటే ఆమె తన అస్తమా రోగం గురించి మాట్లడుతుందో లేక తన భర్త గురించి మాట్లడుతుందో తెలియక తికమక పడేవాడు.
ఆమె ఇలా చెప్పేది.
డాక్టర్ గారు ఇంకా ఈ బాధ భరించడం నా వల్ల కాదు,
ఈ హింస నేను భరించలేను,
25 ఏళ్ళ నుంచి ఎలాగో భరిస్తున్నాను,
ఇంకా నాకు ఓపిక లేదు,
ఒక్కోసారి విసుగొచ్చి మార్చేయలనిపిస్తుంది

తెలుగు విండోస్

విండోస్ ని తెలుగువారి కోసం తెలుగులో అందించాలని ఆ పనిని ఒక తెలుగు టీచర్ కి అప్పగించారు.
ఆ తెలుగు టీచర్ చాల కష్టపడి తెలుగువారి కోసం విండోస్ ని తెలుగులోఇలా తయారుచేసాడు.
WINDOWS - కిటికీలు
MOUSE - ఎలుక
SAVE - రక్షించండి
SAVE AS - ఇలా రక్షించండి
SAVE ALL - అందరిని రక్షించండి
SELECT - ఎన్నుకోండి
MOVE - కధపండి
MOVE ALL - అందరిని కధపండి
RUN - పరిగేట్టండి
PASTE - అతికించండి
CUT - కోయండి
TABLE - బల్ల
BULLETS - తూటాలు

తెలుగోడా మజాకా

ఒక సారి హాలీవుడ్ చూడటానికి వెళ్ళిన తెలుగువాడు జేమ్స్ బాండ్ ని పేరు అడిగాడు

దానికి జేమ్స్ బాండ్ "నా పేరు బాండ్, జేమ్స్ బాండ్, జేమ్స్ బాండ్ 007" అన్నాడు

తరవాత జేమ్స్ బాండ్ తెలుగువాని పేరు అడిగాడు

దానికి మనోడు "నా పేరు రావు, ప్రసాద రావు,
లక్ష్మి నరసింహ ప్రసాద రావు,
సుబ్రమణ్య లక్ష్మి నరసింహ ప్రసాద రావు,
సత్య సుబ్రమణ్య లక్ష్మి నరసింహ ప్రసాద రావు,
వెంకట సత్య సుబ్రమణ్య లక్ష్మి నరసింహ ప్రసాద రావు,
శ్రీ వీర వెంకట సత్య సుబ్రమణ్య లక్ష్మి నరసింహ ప్రసాద రావు..........

జీవితం - నెట్ వర్క్

మనిషి జీవితానికి మొబైల్ నెట్ వర్క్ కంపనీలకు చాలా దగ్గరి సంబంధం ఉందనిపిస్తుంది.

బ్యాచిలర్ - AIRTEL : ఇలాంటి స్వేచ్చా స్వంతంత్రము మరెక్కడ

ప్రేమలో పడ్డవాడు - VODAFONE : నువ్వేక్కడికి వెళితే నేనక్కడ.

పెళ్లి - IDEA : ఒక ఐడియా మీ జీవితాన్నే మర్చేస్తుంది

పిల్లలు - TATA INDICOM : ప్రతి కనెక్షన్ తో ఒక మొబైల్ ఉచితం.

తరవాతేముంది

మీరు కాల్ చేసిన మొబైల్ కవేరేజి ఏరియాలో లేదు.

మీరు కాల్ చేసిన మొబైల్ ప్రస్తుతము స్విచ్ఆఫ్ చేసి ఉంది.

బొమ్మలు

పదేళ్ళ వయసున్న చింటు వాళ్ల అమ్మతో అంటున్నాడు...

చింటు : అమ్మా మా ఫ్రెండ్స్ ఆడుకోవటానికి మన ఇంటికి వస్తున్నారు, బొమ్మలన్నీ దాచేయ్

అమ్మ: ఎందుకురా వాల్లెమన్నాదొంగలా నీ బొమ్మలు ఎత్తుకుపోతారా ఏంటి ?

చింటు : అది కాదమ్మా వాళ్ల బొమ్మలు గుర్తుపడతారని.......

సలహా ఫీజు

ఒకరోజు పార్టీలో ఒక డాక్టర్ మరియు లాయర్ మాట్లాడుకుంటున్నారు.
కాని మద్యలో ఎవరో ఒకరు వచ్చి డాక్టర్ ను ఏవో సలహాలు అడిగి ఆటంకం కలిగిస్తున్నారు.
కొద్దిసేపు తరవాత ఆ డాక్టర్, లాయర్ తో "మీరు ఆఫీసు బయట ఉన్నపుడు ఎవరైనా సలహాలు అడిగితే వారిని ఎలా అపుతారు".

"వారిని అపను, వారికి సలహాలు ఇస్తాను, తరవాత బిల్లు పంపిస్తాను " అని చెప్పాడు లాయర్.
దానికి డాక్టర్ అశ్యర్యపోయి ఒకసారి చేసిచూద్దమనుకున్నాడు.

మరుసటి రోజు కొంత ఇబ్బందిగానే బిల్స్ తయారుచేసాడు.
వాటిని పంపడానికి మెయిల్ బాక్స్ తెరిస్తే అందులో ముందురోజు లాయర్ ఇచ్చిన సలహా ఫీజుకు సంబందించిన బిల్ కనబడింది.

పార్టీ

ఒకరోజు మా ఆఫీసులో నా సహొద్యోగులు లక్ష్మిగారు మరియు రాజుగారి మధ్య సంబాషణ
లక్ష్మి : రాజుగారు ఈరోజు నా రాసిఫలాల్లో ఏంచెప్పారో తెలుసాండి, నాకు ఎవ్వరు పార్టీ ఇచ్చిన వారికి రెట్టుంపు లాభం కలుగుతుందని
రాజు : మరి మీరు పార్టీ ఇస్తే ఏమవుతుంది?
లక్ష్మి : నష్టం వస్తుందని చెప్పారు.

రాజు : నాక్కూడా ఈరోజు రాసిఫలాల్లో ఒక ముఖ్య విషయం చెప్పారండి
లక్ష్మి : అవునా ఏంటది?
రాజు : ఆడవాళ్లమాటలు నమ్మవద్దని.
లక్ష్మి : ??????????

పెనం పైనుంచి పొయ్యిలోకి

అమాయకుడు : పెనం పైనుంచి పొయ్యిలోకి పడటం అంటే ఏంటి?

చమత్కారి : మొదటది ప్రేమించడము తరవాతది పెళ్లి చేసుకోవడం

యజమాని - పనివాడు

యజమాని : క్రింద పడ్డ స్వీటు తుడిచి నాకు పెడతావా, ఇంకోసారి చూసానంటే పనిలోంచి తీసేస్తా
అని గట్టిగా అరిచాడు
పనివాడు : క్షమించండి అయ్యగారు ఇంకోసారి కింద పడ్డవి పెట్టను, ఇంకా మీరు మన కుక్క స్వీటు నాకడం చూసి తిట్టారనుకున్నా
యజమాని : ?????????

ప్రేమ పెళ్లి

భక్తుడు: ప్రేమ అంటే ఏమిటి స్వామి?
సన్యాసి: మనకుగా వెతుక్కుని దూకే గొయ్యి నాయన.
భక్తుడు: మరి పెళ్లి ఏమిటి స్వామి?
సన్యాసి: పెద్దవాలంతా కలసి తీసే నుయ్యి నాయన.
భక్తుడు: ఆ??????